ఆ కుర్చీలో ఎవరు కుర్చున్నా చనిపోతారట..ఈ మిస్టరీ వెనుక ఉన్న హిస్టరీ ఏంటంటే..!

-

కొన్ని వీడని చిక్కుముడుల గురించి తెలుసుకోవటం అంటే భలే ఆసక్తికరంగా ఉంటుంది. మిస్టరీలు వెనుక ఉన్న హిస్టరీలు ఏంటో తెలుసుకోవాలని కుతూహలత ఎవరిలోనైనా ఉంటుంది. ఇప్పుడు చెప్పే విషయం కూడా అలాంటిదే.. నమ్మడానికి కష్టంగా ఉన్నా..ఇది నిజమే..అదొక కుర్చీ..కుర్చీహే కదా అని కుర్చుంటే మాత్రం చనిపోవాల్సిందే..అవునండీ..ఆ కుర్చీలో ఎవరు కుర్చున్నా వాళ్లంతా చనిపోతాన్నారట. దాని వెనక ఓ వ్యక్తి ఉన్నాడనేది చరిత్ర చెబుతున్న మాట.

యునైటెడ్ కింగ్‌డమ్‌ లోని నార్త్ యార్క్‌షైర్‌లో 1702లో థామస్ బస్బీని ఉరి తీశారు. అతనో హంతకుడు. ఆ కుర్చీ అతనిదే. అతను చనిపోయాక అసలు కథ మొదలైందట. ఆ కుర్చీలో అతని ఆత్మ ఉందనీ అదే పగబట్టి అందులో కూర్చున్న వాళ్లను చంపుతోందని కథలు కథులుగా చెప్పుకుంటారు. ఇందులో చాలా మలుపులు, ఆసక్తికర అంశాలు కొన్ని ఉన్నాయి. ఎన్నో ఘటనల తర్వాత చివరకు ఆ కుర్చీ… థిర్స్క్ మ్యూజియంలో ఉంచారు. ఈ ఛైర్ స్టోరీ ఏంటో చూసేద్దాం.!

మావతో విభేధం..ప్రాణం తీసేవరకూ..

1702లో థామస్ బస్బీ తన మావయ్య డేనియల్ ఆటీని చంపేశాడు. మామతో కలిసి ఇల్లీగల్‌గా నకిలీ కాయిన్ల తయారీ బిజినెస్ చేసేవాడు. అదొక్కటే కాదు… ఇంకా అలాంటి చాలా అక్రమ వ్యాపారాలు చేసేవాడు. ఓ రోజు మామా అల్లుడి మధ్య కుర్చీ విషయంలో తేడా కొట్టింది. అసలే థామస్ కోపిష్టి. మామతో గొడవకు దిగాడు. మామను చంపేశాడు. ఆ తర్వాత అక్కడే తన కుర్చీలో కూర్చొని… ఇకపై నాదే సామ్రాజ్యం అన్నాడు. తనకు ఎవరు ఎదురుతిరిగినా ఇదే గతి పడుతుందని విర్రవీగాడు. బాగా తాగాడు. అంతలోనే విషయం పోలీసులకు తెలియడం… అతన్ని అరెస్టు చెయ్యడం జరిగిపోయాయి.. తాను చంపలేదంటూ చెప్పుకొచ్చాడు థామస్ బస్సీ చెప్పాడు.. తనను ఉరితీస్తే సహించనంటూ గగ్గోలు పెట్టాడు. కోర్టు తీర్పుతో… పోలీసులు అతి బలవంతంగా అతన్ని ఉరి తీశారు.

అక్కడే ఉరి తీశారు:

బస్బీకి ఓ లాడ్జి లాంటిది ఉండేది. దాని పేరు బస్బీ స్టూప్ ఇన్ .దాని ఎదురుగా A61, A167 క్రాస్‌రోడ్స్ ఉండేది. ఇప్పుడది రౌండెబౌట్‌గా మారింది. అక్కడే ఓ పబ్ కూడా ఉంది. అదే పనిగా గింజుకుంటున్న బస్బీని ఎక్కడ ఉరితియ్యాలా అని చూసిన పోలీసులు… అతని లాడ్జిలోనే చంపితే మేలు అనుకున్నారు. అదైతే చాలా విశాలంగా ఉంటుంది. పారిపోయే అవకాశం లేకుండా ఉంటుంది. ఇలా కొన్ని లెక్కలు వేసుకొని… అక్కడ ఉరి తీశారు. అదే ప్రదేశంలో బస్బీ ఆత్మగా తిరిగినట్లు కథలొచ్చాయి. ఇప్పటికీ అక్కడ కసితో రగిలిపోతున్న బస్బీ ప్రేతాత్మ తిరుగుతోందని నమ్ముతున్నారు.

వరుసగా మరణాలు:

బస్బీని ఉరి తీసిన చోట ఉన్న పబ్‌లో అతని కుర్చీని ఉంచారు. తద్వారా ఓ హంతకుడి కుర్చీ అది అనే ప్రచారం బాగా జరిగింది. చాలా మంది ఆ కుర్చీలో కూర్చునేందుకు ఆసక్తి చూపించేవారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఓ కెనడా సైనికుడు ఆ పబ్‌కి వెళ్లాడు. కుర్చీలో కూర్చున్నాడు. హాయిగా మద్యం తాగాడు. ఆ తర్వాత యూరప్ మెయిన్‌లాండ్‌లో యుద్ధం జరుగుతోందని పిలుపు రాగానే హడావుడిగా వెళ్లాడు. అక్కడ బాంబింగ్‌లో చనిపోయాడు. అప్పుడే స్థానికులు ఆ కుర్చీలో కూర్చోవడం వల్లే చనిపోయాడని పుకారు పుట్టించారు.. కొంత మంది కొట్టిపారేశారు. ఆ తర్వాత 1970 సమయంలో కొన్ని ప్రమాదాలకు ఆ కుర్చీ కారణమైంది అనే వాదన తెరపైకి వచ్చింది. ఓ వ్యక్తి ఆ కుర్చీని దొంగిలించి కారులో తీసుకెళ్లగా… ప్రమాదం జరిగి కారు నుజ్జునుజ్జైంది. అతను చనిపోయాడు. హైలెట్ ఏంటంటే.. కుర్చీకి మాత్రం ఏమీ కాలేదని తెలిసింది.

మ్యూజియంలో వేలాడుతూ:

దాదాపు 60 మంది దాకా ఆ కుర్చీలో కూర్చున్న వాళ్లు చనిపోయారట. వరుస ఘటనలతో హడలెత్తిన ప్రజలు ఆ కుర్చీని తగలబెడితే… తమ ప్రాణాలు పోతాయని భయపడ్డారు. అందువల్ల దాన్ని 1978లో త్రిస్క్ మ్యూజియంలో సీలింగ్‌కి 5 అడుగుల ఎత్తులో వేలాడదీశారు. తద్వారా అందులో ఎవరూ కూర్చునే ఛాన్స్ లేకుండా చేశారు. దాని కింద ఆ కుర్చీ ఎంత ప్రమాదకరమో తెలుపుతూ మొత్తం హిస్టరీ వివరంగా రాశారు కూడా. అందులో ‘కుర్చీని కనీసం ముట్టుకొనే సాహసం కూడా చెయ్యొద్ద’నే హెచ్చరికా ఉంటుంది.

కొత్త విషయం చెప్పిన చిత్రకారుడు:

ఫర్నిచర్లను పరిశీలించే ఓ చరిత్రకారుడు ఆ కుర్చీని పరిశీలించి ఓ కొత్త విషయం చెప్పాడు. దానికి ఓ ప్రత్యేక యంత్రం ఉంది. దాన్ని తిప్పితే కుర్చీ నుంచి ముళ్ల లాంటివి పైకి లేస్తాయట. అందువల్ల అదో పురాతన కుర్చీగా భావించాడు. అది బస్బీ వాడిన కుర్చీ కాకపోవచ్చనే అనుమానం వ్యక్తం చేశాడు. చిత్రమేంటంటే మూఢనమ్మకాల్ని సైంటిస్టులు ఎవరూ నమ్మరు. కానీ ఈ చైర్ విషయంలో మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇందులో కూర్చున్న వారంతా రకరకాల కారణాలతో ఎలా చనిపోతున్నారో తెలియక ఇదో అంతుబట్టని మిస్టరీగా మిగిలిపోయింది.

సరిగ్గా ఓ హర్రర్ కమ్ థ్రిలింగ్ మూవీకి సరిపోయ్ స్క్రిప్ట్ వచ్చేసినట్లు ఉందికదా.. మొత్తానికి ఆ కూర్చీని మ్యూజియంలో వేలాడదీశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు అది అలా ఉంటుందో కూడా చెప్పలేం.

Read more RELATED
Recommended to you

Latest news