ఈ యొక్క రూల్ ని మార్చడానికి ప్రభుత్వానికి 50 ఏళ్లు పట్టింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం నుండి కూడా దీనిని మార్చలేకపోయారు. పెన్షనర్ కనుక మరణిస్తే ఆ పెన్షన్ ని ఇంట్లో ఎవరికి అయితే అర్హత ఉంటుందో వాళ్ళు తీసుకోవచ్చు అని ప్రభుత్వ ఉద్యోగస్తుడిని హత్య చేస్తున్నారు. అయితే ఇలా చేయడం నిజంగా పెద్ద నేరం. ఇటువంటి వాళ్లకి శిక్ష వేయాలి.
ఒకవేళ కనుక నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తే అప్పుడు కుటుంబ పెన్షన్ బకాయిలతో తిరిగి ప్రారంభించబడుతుంది. ఒకవేళ కనుక దోషిగా తేలితే బకాయిలతో పాటు కుటుంబంలోని తదుపరి అర్హత గల సభ్యునికి పెన్షన్ తిరిగి ప్రారంభించబడుతుంది. ఈ కేసు కొన్నేళ్ల నుంచి కూడా కొట్టుమిట్టాడుతోంది.
జూన్ 16 న ప్రభుత్వం ఈ నిబంధనను మార్చింది. ఇలాంటి సందర్భలు ఏమైనా వస్తే తదుపరి అర్హతగల సభ్యునికి పెన్షన్ వెంటనే ఇవ్వబడుతుంది అని కొత్త ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ నేరారోపణకి సంబంధించి అనేక విషయాలు తేల్చాలి కాబట్టి సమయం ఎక్కువ పడుతుంది.
ఇటువంటి సమయంలో పెన్షన్ నిలిపి వేస్తే కుటుంబం ఇబ్బంది పడుతుంది అని సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉంది. అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి అనేది చూస్తే… కుటుంబ పెన్షన్ పొందడానికి అర్హత ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగిని హత్య చేసిన నేరానికి లేదా అలాంటి నేరానికి పాల్పడినందుకు కుటుంబ పెన్షన్ ఉండదని కొత్త నియమం పేర్కొంది.
కానీ ఈ కేసు ముగిసే వరకు కుటుంబంలోని ఇతర అర్హత గల సభ్యునికి పెన్షన్ ఇవ్వచ్చు అని కొత్త ఆదేశాలు చెబుతున్నాయి. ఒకవేళ కనుక భార్య నేరం చేస్తే ఆమెకి పెన్షన్ ఇవ్వడం మానేసి ఇతర అర్హత గల సభ్యునికి పెన్షన్ ఇస్తారు.
ఒకవేళ కనుక బిడ్డ మైనర్ అయితే గార్డియన్ కి ఆ డబ్బులు ఇస్తారు. అయితే నేరారోపణలు ఉన్న వ్యక్తి గార్డియన్ కింద ఉండకూడదు అని క్లియర్ గా చెప్పారు. ఒకవేళ కనుక నిందితుడు నిర్దోషిగా ప్రకటించినట్లయితే.. నిర్దోషిగా ప్రకటించిన తేదీ నుండి కుటుంబ పెన్షన్ అతనికి లేదా ఆమెకు పెన్షన్ వస్తుంది.