తెలుగు సినీ ఇండస్ట్రీలో కోలీవుడ్ పరిశ్రమలో విభిన్నమైన నటుడుగా పేరు పొందారు కమలహాసన్. ఎప్పుడూ కూడా తను చాలా డిఫరెంట్ గా ఉండే పాత్రలని ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు. 1960వ సంవత్సరంలో చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఇప్పటికి 70 సంవత్సరాలకు పైగా నటిస్తూనే ఉన్నారు కమలహాసన్. నటుడుగా ఎన్నో సినిమాలలో అదరగొట్టిన కమలహాసన్ ఈ ఏడాది విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం కమలహాసన్ భారతీయుడు -2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ గురించి ఒక రూమర్ వైరల్ గా మారుతోంది వాటిపై హీరోయిన్ క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
గడిచిన కొన్ని సినిమాలు విషయానికి వస్తే కమలహాసన్.. హీరోయిన్ పూజ కుమార్ వరుసగా విశ్వరూపం, ఉత్తమ విలన్, విశ్వరూపం -2 తదితర చిత్రాలలో కనిపించారు. కమలహాసన్ తో పూజ నటించడమే కాకుండా పలు రొమాంటిక్ సన్నివేశాలతో పాటు లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించింది. దీనివల్ల ఈ ముద్దుగుమ్మకు కమల్ హాసన్ కుటుంబంతో మంచి బాండింగ్ ఏర్పడినట్లుగా సమాచారం. కమలహాసన్ పూజ కుమార్ కలిసి దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇక దీంతో కమలహాసన్, పూజ కుమార్ ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారనే వార్తలు ఎక్కువగా వినిపించాయి. గతంలో హీరోయిన్ సారిక, వాణి గణపతి, గౌతమి లతో కూడా కమలహాసన్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు. ఇప్పుడు తాజాగా పూజతో రిలేషన్ గురించి వార్తలపై పూజ కుమార్ మాట్లాడుతూ.. కమలహాసన్ తో నేను ఐదు సంవత్సరాల నుంచి సినిమా చేస్తున్నాను ఆయన కుటుంబ సభ్యులు కూడా నాతో బాగా క్లోజ్ అయ్యారు. అందుచేతను ఈ రూమర్స్ వచ్చాయని మా మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని క్లారిటీ ఇవ్వడం జరిగింది.