ఈ రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం రావాలంటేనే గగనమైంది. ప్రైవేట్ సెక్టార్‌లోనే జాబ్ దొరకక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఏకంగా గవర్నమెంట్ జాబ్ వస్తే.. జాక్‌పాట్ కొట్టినంత సంతోషంగా ఫీల్ అవుతుంటారు. లైఫ్‌లో సెటిల్ అయిపోయినట్లనే భావన చాలా మందిలో ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగం ఓ మహిళ పాలిట శాపంగా మారింది. ఓ చేయిని కోల్పోయేలా చేసింది. భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని.. ఓ భర్త భయంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్‌లో చోటు చేసుకుంది.
వెస్ట్ బెంగాల్ కోజల్సాకు చెందిన రేణు ఖాతున్ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఇటీవల పరీక్షల్లో పాసై.. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంది. అయితే భర్త షేర్ మహమ్మద్‌కు భార్య ప్రభుత్వ జాబ్ చేయడం ఇష్టం లేదు. భార్య ప్రభుత్వ ఉద్యోగం చేస్తే.. ఆమెను ఎక్కడ వదిలేసి వెళ్లిపోతుందనే భయంతో చేతులు నరికేశాడు. అనంతరం ఆస్పత్రికి తరలించాడు. డాక్టర్లు ఆమె చేతిలో కొంత భాగాన్ని తొలగించారు. అయితే భార్యను ఆస్పత్రిలో జాయిన్ చేయించిన తర్వాత భర్త షేర్ మహమ్మద్ అక్కడి నుంచి పరారయ్యాడు.