బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎప్పుడు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. తమపై ఏ చిన్న విమర్శలు వచ్చినా దానిని సమర్థవంతంగా తిప్పికొడుతూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు బి ఎస్ పి పార్టీ సిద్ధం అవుతుంది అని ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ పలుమార్లు ఇదే విషయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి పై విమర్శలు కూడా చేసింది. ఇక నిజంగానే మాయావతి బీజేపీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారా ప్రచారం ఊపందుకుంది. ఇక తాజాగా ఇదే విషయంపై స్పందించిన మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో కలిసి నడిచే అవకాశమే లేదు అంటూ స్పష్టం చేశారు మాయావతి. కాంగ్రెస్ సమాజ్వాది పార్టీలు బీఎస్పీ పార్టీకి ముస్లింల దూరం చేసేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ బిజెపి విధి విధానాలు సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకం అంటూ వ్యాఖ్యానించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఈ రెండు పార్టీలు ఎన్నటికీ జట్టు కట్ట బోవు అంటూ స్పష్టం చేశారు. దీంతో గత కొన్ని రోజుల నుంచి బిఎస్పి బీజేపీతో పొత్తు పెట్టుకో పోతుంది అంటూ వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.