ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సర్కార్ వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్ర రాజధాని పై తీవ్ర సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. వైసీపీ వచ్చాక.. అమరావతిని మూడు ముక్కలు చేసింది. దీంతో అమరావతి రైతులు గత ఏడాది నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. విశాఖను రాజధానిగా ఇండియన్ నేవీ గుర్తించింది.
రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఎక్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించిన తర్వాత యుద్ధ నౌకకు విశాఖ పట్నం పేరుతో నామకరణం చేశామని నేవీ అధికారులు తెలిపారు. డిసెంబర్ 4 వ తేదీన జరిగే నేవీ వేడుకలకు రావాలని… సీఎం జగన్ కు నేవీ అధికారులు.. ఆహ్వానించారు. ఇప్పుడు ఈ వ్యవహారం చర్చనీయంశంగా మారింది. అయితే… దీనిపై మాజీ మంత్రి జవహర్ ఫైర్ అయ్యారు. నేవీ ప్రకటన అనాలోచితమని… విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా గుర్తించే అధికారం నేవికి ఎక్కడిది..? అని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేయటంలో జగన్ దిట్ట అని… నేవిని సైతం వివాదాల్లోకి లాగటం జగనుకే సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేయటమే కాకుండా నేవిని భాగస్వామ్యం చేయటం దేనికి సంకేతమో చెప్పాలని వెల్లడించారు.