MEGA154 నుంచి మెగాస్టార్ అదిరిపోయే లుక్.. ”అరాచకం ఆరంభం” !

-

ఈ మధ్యే ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న మెగా స్టార్‌ చిరంజీవి.. తన ఫ్యాన్స్‌ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి… మూడు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సినిమా నుంచి… ఓ అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం.

ఇవాళ ఈ సినిమా పూజ కార్యక్రమం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే… ఈ సినిమా నుంచి అదిరిపోయే మెగాస్టార్‌ చిరంజీవి పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. అరాచకం ఆరంభం అంటూ.. ఈ పోస్టర్‌ టైటిల్‌ కూడా పెట్టారు. ఇక ఈ పోస్టర్‌ లో.. సిగరేట్‌ కాలుస్తూ… చాలా స్టైల్‌ గా కనిపించారు చిరంజీవి. ఇక ఈ పోస్టర్‌ చూసిన మెగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news