సాధారణంగా కుటుంబంలో ఏమైనా సమస్యలున్నాయని దైవ దర్వనానికి వెళ్తుంటారు. అక్కడ తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉండి.. పరధ్యానంతో హుండీలో కానుకలు వేస్తుంటారు. అయితే హుండీలో కానుకలు వేయబోతూ పొరపాటున తన చేతిలో ఉన్నటువంటి ఐఫోన్ ను కూడా హూండీలో వేసేశాడు. హుండీలో ఏది పడినా అది స్వామి వారికే చెందుతుందని.. అందువల్ల ఫోన్ తిరిగి ఇవ్వడం కుదరదని అధికారుల నుంచి మంత్రి వరకు అందరూ చెప్పారు.
దీంతో ఆయన తల పట్టుకున్నారు. ఈ విచిత్రమైన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. చెన్నై అంబత్తూర్ వినాయకపురం కి చెందిన దినేష్ చెన్నై మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ఉద్యోగి. అక్టోబర్ లో చెంగల్పట్టు జిల్లా తిరుస్పోర్ లో ప్రసిద్ద కందస్వామి మురుగన్ ఆలయానికి వెళ్లారు. హుండీలో కానుక వేసేటప్పుడు చేతిలో ఉన్న ఐఫోన్ అందులో పడిపోయింది. ఐఫోన్ తీసి ఇవ్వాలని కోరగా.. దేవాదాయ శాఖ అధికారులకు విన్నవించాలని ఆలయ సిబ్బంది చెప్పారు. తాజాగా హుండీ లెక్కించడంతో ఆ సమయంలో వెల్లినా ఆయనకు నిరాశే మిగిలింది. దేవుడి ఖాతాకి చేరుతుందని.. దానిని తిరిగి ఇచ్చేందుకు నిబంధనలు అంగీకరించవని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం విశేషం.