క్లైమాక్స్‌కు చేరిన IPL పోరు..ఇవాళ ఢిల్లీతో తలపడనున్న హైదరాబాద్‌

ఐపీఎల్‌ 2020 పోరు క్లైమాక్స్‌కు చేరింది. వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌… ఇవాళ ఢిల్లీతో తలపడనుంది. ఢిల్లీని ఓడించడానికి వ్యూహాలు రచిస్తోంది. అబుదాబి పిచ్‌ చాలా స్లోగా ఉంటుందని బేసిక్స్‌ను కచ్చితంగా అవలంభిస్తే సరిపోతుందని అంటున్నాడు రషీద్ ఖాన్‌. మరోవైపు ముంబై చేతిలో చిత్తుగా ఓడిన ఢిల్లీ ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలన్న కసితో బరిలోకి దిగుతోంది..ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు ఎలిమినేట్‌ అవుతుంది.ఈ రోజు జరిగే మ్యాచ్‌ రెండు జట్లకు చాలా ముఖ్యం కానుంది..ఇప్పటికే దూకుడు మీద హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్ చేరాలని శ్రమిస్తుంది..ఎప్పటికప్పుడు జట్టులో మార్పులు చేసుకుంటూ జట్టు గెలుపుకు వ్యూహాలు రచిస్తుంది..మరోవైపు సన్‌ రైజర్స్ జట్టు కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుంది..ఈ సారి జట్టును మొదటి స్థానంలో నిలబెట్టడానికి జట్టు సమిష్టిగా రాణిస్తుంది..