యూఎస్ ఎన్నికల్లో అమెరికన్ భారతీయుల మద్దతు పై తాజా సర్వే…!

-

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అధ్యక్షుడిగా మరోసారి గెలిచి తీరాలని ఉవ్విళ్లూరుతున్న ట్రంప్‌.. తన ప్రచారంలో చైనాను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాపించడానికి ఆదేశమే కారణమంటూ.. ఆరోపణలు గుప్పిస్తున్నారు ట్రంప్‌. ఇటీవల స్వయంగా తనకే వైరస్‌ సోకడంతో.. చైనాపై విమర్శల జోరును మరింత పెంచారు ట్రంప్‌.

ఇక ఈ ఎన్నికల్లో అమెరికన్‌ భారతీయులు జో బైడెన్‌ వైపే నిలువనున్నట్టు తాజా సర్వేలో వెల్లడైంది. 72శాతం ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 22శాతం మంది మాత్రమే రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంప్‌కు మద్దతునిస్తున్నట్టు సర్వేలో తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news