అధికారంలో ఉన్నప్పుడు ఆయనదే కీ రోల్..ఇప్పుడు పత్తాలేకుండా పోయారా…?

-

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన పేరు మార్మోగిపోయేది.మున్సిపల్ శాఖతోపాటు అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర వహించారు.ఆయన అనుచరులు సైతం ఓ రేంజ్‌లో సందడి చేసేవారు. అలాంటి నాయకుడిని.. ఆయన అనుచరులను ఒకే ఒక్క ఓటమి సోదిలో లేకుండా చేసింది.

మాజీ మంత్రి పి. నారాయణ నెల్లూరు అభివృద్ధిలో తన మార్కు చూపించారు. అలాంటి నాయకుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సింహపురికి చుట్టం చూపుగా వస్తుపోతున్నారు. అది కూడా కేవలం తన విద్యా సంస్థల పరిధిలోనే ఉంటున్నారు. అవసరం అనుకుంటే అనుచరులతో మాట్లాడటం లేదంటే తన పని ఏదో చూసుకుని సైలెంట్‌గా వెళ్లిపోతున్నారట నారాయణ.

మాజీ మంత్రి పరిస్థితే ఇలా ఉంటే.. నారాయణ అనుచరుల రాజకీయ భవిష్యత్‌ మరింత దారుణంగా ఉందనే టాక్‌ వినిపిస్తోంది. ఆయన ముఖ్య అనుచరుల్లో పట్టాభిరామిరెడ్డి ఒకరు. టీడీపీ నెల్లూరు సిటీ ఇంఛార్జ్‌ పదవి కోసం చాలా సీరియస్‌గా ప్రయత్నించారు పట్టాభి. కానీ.. ఆవేశం, దూకుడు బాగా ఉన్న నుడా మాజీ చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి పార్టీ అవకాశం కల్పించింది. మాజీ మంత్రి సిఫారసు చేసిన వ్యక్తికి TNSF పదవి ఇవ్వకపోవడంతో అనుచరులంతా పునరాలోచనలో పడ్డారట. నెల్లూరు పార్లమెంట టీడీపీ అధ్యక్ష పదవి అయినా పట్టాభికి వస్తుందని లెక్కలు వేసుకున్నారట. ఆ పదవి సైతం మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌కు ఇవ్వడంతో టీడీపీలో తమను పూర్తిగా పక్కనపెట్టారనే అభిప్రాయానికి వచ్చేశారట నారాయణ వర్గం.

నారాయణ వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరనుండటం, నారాయణ కూడా పూర్తిగా ఇనాక్టివ్‌గా మారడంతో అనుచరులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీనికి తోడు గంటా స్టెప్ తర్వాత నారాయణ అడుగు వుంటుందని అంటున్నారు.నెల్లూరు నగరాన్ని తీర్చి దిద్దిన నారాయణ ప్రస్తుత పరిస్థితుల్లో యాక్టివ్ గా లేక పోవడం అయనతో పాటు అయన వర్గానికి మైనస్ అవుతుందని ముఖ్యంగా ప్రజలల్లో అయన పట్లు ఉన్న సానుకూల వాతావరణాన్ని కొనసాగించాలంటే అయన వర్గం ఖచ్చితంగా ప్రజలలో తిరగకపోతే భవిష్యత్ లో నారాయణ,అయన వర్గాన్ని పట్టించుకోరని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news