నీట్ 2020 ఫలితాలలో ఒక విద్యార్ధి వయసు కారణంగా ఫస్ట్ ర్యాంక్ కోల్పోవడం సంచలనం అయింది. శుక్రవారం నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్, (నీట్) 2020 ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ లో ప్రకటించారు. ఈ సంవత్సరం, ఒడిశాకు చెందిన సోయెబ్ అఫ్తాబ్ 720 స్కోరుతో మొదటి ర్యాంక్ సాధించారు. అయితే ఢిల్లీకి చెందిన ఆకాన్షా సింగ్ కూడా నీట్ లో 720 మార్కుల్లో 720 మార్కులు సాధించారు.
కాని ఆమె వయసు సోయెబ్ కన్నా చిన్నది కావడంతో టాప్ ర్యాంక్ కోల్పోయారు. టై బ్రేకింగ్ విధానంలో వయస్సు, సబ్జెక్ట్ వారీగా మార్కులు అలాగే తప్పు సమాధానాల సంఖ్య వంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. ఇద్దరూ వందశాతం మార్కులు సాధించినా వయసు కారణంగా ర్యాంక్ పోయింది. నీట్ పరీక్షలో అభ్యర్థి ర్యాంకింగ్ బయాలజీ మరియు కెమిస్ట్రీ లో పొందిన స్కోర్ల ఆధారంగా నిర్ణయిస్తారని అధికారులు చెప్పారు.