దుబ్బాక నియోజకవర్గ తొలి మహిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాత ఇందులో అలాంటి అనుమానం లేదని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ నాయకుల చేతుల్లో ఢిల్లీలో, గల్లిలో ఏమీలేదు అని ఆయన ఎద్దేవా చేసారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్, తెదేపా కనీసం తాగునీటి సమస్య కూడా తీర్చలేదని ఆయన విమర్శించారు. దేశంలో, కాంగ్రెస్, భాజపా పాలిత రాష్ట్రంలో ఎక్కడ కూడా బీడీల పెన్షన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే మళ్లా దొంగ రాత్రి కరెంట్ వస్తదన్నారు. కాంగ్రెస్ ఉన్నపుడు కరెంట్ ఇవ్వక రైతులను ఇబ్బందులు పెడితే నేడు భాజపా మీటర్లు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తుంది అని ఆయన విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు. వానాకాలం ఉసిల్లు వచ్చినట్లు ఓట్లు వచ్చినపుడు కాంగ్రెస్, భాజపా నాయకులు వచ్చి పోతారని ఆయన ఎద్దేవా చేసారు. ప్రజలకు అందుబాటులో ఉండే తెరాస మాత్రమే అని అన్నారు.