మహారాష్ట్రలు కరోనా వైరస్ కేసులు సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం దేశంలోని అత్యధిక కరోనా వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రంగా మహారాష్ట్ర నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ మహారాష్ట్రలో మాత్రం రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది.
ఈ క్రమంలోనే మాస్కులు వాడకం తప్పనిసరిగా మారిన నేపథ్యంలో మార్కెట్లో మాస్కుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే మాస్కు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చింది. మూడు పొరలు ఉన్న మాస్క్ లను కేవలం 3 రూపాయలకు మాత్రమే అమ్మాలని ఎన్95 మాస్క్ లను నాణ్యతను బట్టి 19 రూపాయల నుంచి 45 రూపాయల వరకు అమ్మాలి అంటూ సూచించింది. రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమలులో ఉన్నంత కాలం ఇదే ధరలు కొనసాగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.