గేదను బాగా పోషించాడని ఆ యువకుడినే పెళ్లి చేసుకున్న యజమానురాలు..కట్‌ చేస్తే..

-

కారు డ్రైవర్‌ను లవ్‌ చేసి పెళ్లిచేసుకోవడం వంటివి మనం సినిమాల్లోనూ నిజ జీవితంలోనూ చూసే ఉంటాం.. కానీ గేదలు బాగా కాస్తున్నాడని అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవడం మీరెప్పుడైనా విన్నారా.. ఇక్కడ అదే జరిగింది.. గేదను బాగా పోషించాడని ఫిదా అయిపోయిన యువతి ప్రపోజ్‌ చేసింది. కట్‌చేస్తే.. పెళ్లైంది.. నాలుగు గేదలు కాస్తా 40 గెదలు అయ్యాయి.. రీల్‌ స్టోరీని మరిపించే ఈ రియల్‌ స్టోరీపై మీరు ఓ కన్నేయండి.!

అమ్మాయి పేరు ముస్కాన్ 20 ఏళ్ళు , అబ్బాయి పేరు అమీర్ 25 ఏళ్ళు అని తెలుస్తోంది. వరుడు పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. తెలిసిదేంటంటే..అమ్మాయి కుటుంబ సభ్యులు ఇంటి గేదెలను చూసుకోవడానికి 25 ఏళ్ల అమీర్‌ను నియమించుకున్నారు. ముస్కాన్ ఇంట్లో మొత్తం నాలుగు గేదెలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో వాటిని చూసుకోవడంలో కుటుంబం చాలా ఇబ్బందులు పడేది.. దీంతో గేదెలను చూసుకోవడానికి అమీర్‌ను పనిలో పెట్టుకున్నారు.ఇక్కడ వరకూ బానే ఉంది..

అమీర్ సిన్సియర్‌గా, శ్రద్ధగా పని చేసేవాడు. గేదెలను బాగా చూసుకున్నాడు. దీంతో గేదెలు మునుపటి కంటే ఎక్కువ పాలు ఇచ్చేవి.. అమీర్ నిజాయితీ, అంకితభావం చూసి ముస్కాన్ లవ్‌లో పడింది.. అమీర్‌ని ముస్కాన్‌ను ఇష్టపడటం మొదలుపెట్టింది. తర్వాత ఓ రోజు ధైర్యం చేసి అమీర్‌కు తానూ ప్రేమిస్తున్న సంగతి తెలిపింది.. ఆ సమయంలో అమీర్ గేదెల షెడ్డులో గేదెలకు స్నానం చేయిస్తున్నాడు. అమీర్‌ని ప్రేమిస్తున్నట్లు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పింది.

ముస్కాన్ చెప్పిన విషయం విన్న అమీర్‌కు ఒక్కసారిగా మైండ్‌ బ్లాక్‌ అయినంత పనైంది.. అయితే అతను ముస్కాన్‌ను సాయంత్రం వరకు సమయం అడిగాడు. అతను తన కుటుంబ సభ్యులతో మాట్లాడి, ముస్కాన్ ప్రతిపాదనను అంగీకరించాడు. అంతే.. ఇప్పుడు ఇద్దరూ పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అమీర్ నాలుగు గేదెలను 40 గేదెలు చేశాడు…. అంతేకాదు గేదెల సంరక్షణకు ఇప్పుడు ముగ్గురిని నియమించినట్లు ముస్కాన్ తెలిపింది.

అలా వీళ్ల లవ్‌ స్టోరీ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ప్రేమించడానికి కులం, మతం, డబ్బు ఏవి పనికిరావని వీళ్ల ప్యూర్‌ లవ్‌ ద్వారా మరోసారి ప్రూవ్‌ అయింది. ఈరోజుల్లో ఇలాంటి నిజాయితీ గల లవ్‌ స్టోరీలు చాలా అరుదుగా ఉంటున్నాయి. ప్రేమించడానికి పనికొచ్చిన మనిషి..పెళ్లిచేసుకోవాలి అనే సరికి డబ్బు, కులం అడ్డం వస్తోంది.. ఉన్నంత కాలం హ్యాపీగా ఉన్నాం కదా అని బ్రేకప్‌ చెప్పేసి వెళ్లిపోతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news