ఎట్టకేలకు పెళ్లి చేసుకున్న ప్రతినిధి హీరోయిన్.. ఫోటోలు వైరల్..!

-

పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలైంది.. కొన్నాళ్ల ముందు నటీనటులకు సంబంధించి వరుసగా పెళ్లిళ్లు జరిగాయి. ఇప్పుడు మళ్లీ ఈ ట్రెండు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఒక కన్నడ భామ ఇప్పుడు పెళ్లి పీటలెక్కింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. దీంతో తోటి హీరోయిన్స్ ప్రణీత, శాన్వి, సంయుక్త హెగ్డే, నేహా శెట్టి తదితరులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

అసలు విషయంలోకెళితే.. ప్రముఖ హీరోయిన్ శుభ్ర అయ్యప్ప కొత్త ఏడాదిలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేసింది . బ్యాచిలర్ లైఫ్ కు పులిస్టాప్ పెట్టి పెళ్లి పీటలు ఎక్కింది. బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విశాల్ శివప్పతో ఏడడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ మంది బంధుమిత్రుల సమక్షంలో గురువారం వివాహం చేసుకుంది. ముఖ్యంగా వరుడు విశాల్ పూర్వీకులకు చెందిన 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ఇంట్లో ఏ వేడుకకు ఆతిథ్యం ఇచ్చారు. ఇకపోతే తన పెళ్లి వార్తను అభిమానులతో షేర్ చేసుకున్న శుభ్ర మెడలో తాళిపడిన సందర్భం.. తన నుదుటను భర్త సింధూరం దిద్దిన క్షణాల ఫోటోలను ప్రధానంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక ఈమె విషయానికి వస్తే.. సాయిధరమ్ తేజ్ నటించిన రేయ్ సినిమాతో హీరోయిన్గా పరిచయం కావాల్సింది.. కానీ పలు కారణాలవల్ల సినిమా నుంచి తప్పుకుంది. ఆ తర్వాత నారా రోహిత్ , శ్రీ విష్ణు నటించిన ప్రతినిధి చిత్రంతో హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తమిళ్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. పెళ్లి తర్వాత సినిమాలలో నటిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Shubra Aiyappa (@shubra.aiyappa)

Read more RELATED
Recommended to you

Latest news