నేటితో లాక్ డౌన్ ని ఎత్తేస్తారని భావించిన వాళ్లకు ప్రధాని నరేంద్ర మోడీ షాక్ ఇచ్చారు. ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మే 3 వరకు లాక్ డౌన్ ని కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ 19 రోజులు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఏప్రిల్ 20 వరకు లాక్ డౌన్ మరింత కఠినం గా అమలు జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలని అన్నారు.
ఈ నేపధ్యంలో మోడీ ప్రసంగం అనంతరం రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ముందు మోడీ 21 రోజులు లాక్ డౌన్ అన్న సమయంలో రైల్వే శాఖ అన్ని రైళ్ళను నేటి వరకు రద్దు చేసింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని పొడిగించి మే 3 వరకు చేసిన నేపధ్యంలో… అన్ని ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైల్, కొంకణ్ రైల్వే లాంటి సేవలన్నీ 2020 మే 3 వరకు రద్దు చేస్తున్నామని ట్వీట్ చేసింది.
కాగా ఇప్పుడు గూడ్స్ రైళ్ళు అన్ని కూడా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు నిత్యావసర సరుకులకు ఇబ్బంది రాకుండా అన్ని రకాల గూడ్స్ రైళ్ళు నడుస్తున్నాయి. పాలు, నిత్యావసర వస్తువులు, వైద్య పరికరాలను సరఫరా చేసేందుకు మాత్రమే రైలు సేవల్ని వినియోగించుకున్నారు. కాగా నేటి తో లాక్ డౌన్ అయిపోతుంది అనుకుని భావించిన వాళ్ళు రిజర్వేషన్ కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. వాళ్లకు రీ ఫండ్ ఇవ్వనున్నారు.
All passenger train services on Indian Railways including Premium trains, Mail/Express trains, Passenger trains, Suburban Trains, Kolkata Metro Rail, Konkan Railway etc shall continue to remain cancel till the 2400hrs of 3rd May 2020. #IndiaFightsCorona
— Ministry of Railways (@RailMinIndia) April 14, 2020