ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి ఏపీ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను ఎలా అయినా నిర్వహించాలి అనే దాని మీద ఇప్పుడు కసరత్తులు చేస్తుంది ఎన్నికల సంఘం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. దీనితో ఇప్పుడు ఎన్నికలను నిర్వహించడం పై విమర్శలు వస్తున్నాయి. అందుకోసం జగన్ సర్కార్ కొత్త వ్యూహాన్ని కూడా సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికలను నిర్వహించడానికి గానూ హాట్ స్పాట్ లు అనడం మొదలు పెట్టారు.
అలాగే గ్రీన్ జోన్ ఆరెంజ్ జోన్ రెడ్ జోన్ అనే పేర్లను ప్రకటించింది. వాటిల్లో కొన్ని ఆంక్షలను విధించి ఎన్నికల నిర్వహణకు సిద్దమైంది. ఈ తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ని మే 3 వరకు పెంచింది కేంద్రం. ఇప్పుడు ఈ లాక్ డౌన్ తో జగన్ సర్కార్ ఎన్నికలను నిర్వహించే అవకాశం దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఎన్నికల సంఘం అధికారిని కూడా మార్చగా ఆయన ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అయ్యారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు.
ఇప్పుడు లాక్ డౌన్ నేపధ్యంలో ఈ నెల ఎన్నికలను నిర్వహించడం అనేది సాధ్యం కాని పరిస్థితి. అనవసరంగా జగన్ కేంద్రం ఆగ్రహానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆయన వెనక్కు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. కేంద్రానికి కరోనా ప్రభావం లేని వాటి గురించి జగన్ ఎక్కువగా చెప్పారు. వాటిల్లో ఎన్నికలను నిర్వహించాలని భావించినా ఇప్పుడు లాక్ డౌన్ దేశ వ్యాప్తంగా ఉండటం ఎన్నికలను నిర్వహించడం అనేది సాధ్యం కాని పని. అటు రాజధాని తరలింపు, ఇళ్ళ పట్టాల పంపిణి కూడా ఆగిపోయింది.