బిగ్ బాస్ -6 ఉదయభాను రాకపోవడానికి కారణం..?

-

ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ ఉదయభాను గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఉదయభాను ఈసారి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొనబోతోంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితమయ్యాయి. ఇక స్టార్ మా చానల్లో సెప్టెంబర్ 4వ తేదీన కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారి పేర్లు ఈ కార్యక్రమం మొదలుకాకముందే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అందులో భాగంగానే ప్రముఖ యాంకర్ ఉదయభాను పేరు కూడా ఎక్కువగా వినిపించింది. ఉదయభానుకి అత్యధికంగా పారితోషికం ఇచ్చి మరీ ఆమెను తీసుకొస్తున్నారు అనే వార్తలు కూడా వినిపించాయి.

కానీ ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. ఈ కార్యక్రమానికి ఉదయభాను రావడానికి ఎన్నో కారణాలు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఉదయభానును సంప్రదించడమే కాకుండా నాలుగు లక్షల రూపాయలను వారానికి ఇవ్వాలని డిమాండ్ చేసిందట ఉదయభాను. అయితే అంత మొత్తంలో నిర్వహికులు ఇవ్వలేని నేపథ్యంలో ఉదయభాను విషయంలో కొంచెం లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఉదయభాను యాంకర్ గా , మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం వారానికి నాలుగు లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక ఇంత మొత్తం లో పారితోషకం ఇవ్వలేక నిర్వాహకులు ఈమెను పక్కనపెట్టారు. అందుకే బిగ్ బాస్ కార్యక్రమానికి ఉదయభాను రాలేకపోయారని సమాచారం. ఇకపోతే ఉదయభాను ప్రస్తుతం పలు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలోకి కూడా రీఎంట్రీ ఇచ్చింది. ఇక త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించాలి అని ప్రతి ఒక్కరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news