వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ రికార్డు.. 16 జిల్లాల్లో 100 శాతం

-

వ్యాక్సినేష‌న్ లో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతుంది. తొలి డోస్ ను ఏకం గా 16 జిల్లాల్లో 100 శాతం పూర్తి చేశామ‌ని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అలాగే మ‌రో 3 జిల్లా ల్లో 99 శాతం తొలి డోసు వ్యాక్సినేష‌న్ అయింద‌ని తెలిపారు. మ‌రో 8 జిల్ల‌ల్లో 90 శాతానికి పై గా తొలి డోసు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్ర‌య అయింద‌ని తెలిపారు. అలాగే 6 జిల్లాలో 90 శాతం లోపు వ్యాక్సినేష‌న్ జ‌రిగింద‌ని వివ‌రించారు. కాగ మొత్తం తెలంగాణ లో స‌గటు గా 98 శాతం తొలి డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి అయింద‌ని తెలిపారు.

అలాగే ఈ నెల 22 లో గా రాష్ట్ర వ్యాప్తం గా 100 శాతం తొలి డోసు వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌ని ల‌క్ష్యం పెట్టుకున్నార‌ని తెలిపారు. అంతే కాకుండా రెండో డోసు వ్యాక్సినేష‌న్ కూడా వేగం గానే సాగుతుంద‌ని వివ‌రించారు. కాగ క‌రోనా వైర‌స్ వ్యాప్తి కి తోడు ఓమిక్రాన్ వేరియంట్ విజృభింస్తున్న నేప‌థ్యం లో రాష్ట్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది. ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్ ల‌ను త‌ప్పకుండా తీసుకోవాల‌ని సూచిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే క‌రోనా కానీ, ఓమిక్రాన్ కానీ సోకే అవ‌కాశాలు త‌క్కువ గా ఉంటాయ‌ని తెలుపారు. ఒక వేళ సోకినా.. ప్రణాపాయ ప‌రిస్థితులు ఉండ‌వ‌ని వివ‌రించారు.

Read more RELATED
Recommended to you

Latest news