పార్లమెంట్ ఆరవ దశ ఎన్నికల ప్రచారము నేటితో ముగిసింది.7 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 లోక్ సభ స్థానాలకు ఈనెల 25న ఉదయం 7గంటల నుంచి పోలింగ్ జరగనుంది.ఇందులో హర్యానా, ఢిల్లీ సీట్లు ఉండటం విశేషం. మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
ఢిల్లీలో 7 స్థానాలకు గాను లోక్ సభ ఎన్నికలు ఈ ఏడు స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి ఎన్ని స్థానాలలో విజయం సాధిస్తుందో ఆసక్తిగా మారింది.ఈ ఫేజ్ లో ఉత్తర ప్రదేశ్ లో 14 సీట్లు, హర్యానాలోని 10 సీట్లు ఉన్నాయి. గెలుపుపై ఎన్డీఏ కూటమి, ఇండియా కూటములు ఇప్పటికే ఆయా స్థానాలపై గెలుస్తామని ధీమాతో ఉన్నాయి. వచ్చేనెల 1వ తేదీన చివరి దశ ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే.