కే.ఏ.పాల్ కు, సీఎం జగన్ కు పెద్ద తేడా లేదు : రఘురామకృష్ణం రాజు

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు, జగన్మోహన్ రెడ్డి పెద్దగా తేడా ఏమి లేదని టీడీపీ నేత రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంల వైసీపీ దుర్మార్గపు పాలన అంతం కాబోతోందని అన్నారు.  వైసీపీ నాయకులు తమకు 175 స్థానాలు వస్తాయంటూ చేసిన కామెంట్స్ పై ఆయన ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు.

ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కి వారికి 175 సీట్లకు 175 సీట్లు వస్తాయని చెబుతున్నారని అన్నారు. వారే చెప్పగా లేనిది వైసీపీ నాయకులు చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అన్నారు. జూన్ 4న వైఎస్సార్సీపీకి రాష్ట్రంలో పెద్ద కర్మ చేయబోతున్నామంటూ మాస్ ర్యాగింగ్ చేశారు. ఐదేళ్లు రాష్ట్రాన్ని లూఠీ చేసింది చాలక మళ్లీ గెలిచి ఏం ఉద్దరిస్తారంటూ రఘురామ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news