రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా కథలను ఎంచుకుంటూ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తెలుగు హీరోలలో ఏ హీరో కూడా చేరుకొని స్థాయికి ఎదిగాడు ప్రభాస్. ఇక తర్వాత వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సైతం రికార్డుల మోత మోగించింది. భారతీయ చలనచిత్రానికి ఉన్న సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పింది. అయితే ఆ తర్వాత వచ్చిన సాహో , రాధే శ్యామ్ సినిమాలు మాత్రం ఘోరంగా పరాజయం పాలయ్యాయి. నిజానికి సాహూకు కలెక్షన్లు వచ్చినా.. కథ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం అందరి కన్ను ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ సినిమా పైనే ఉండడం గమనార్హం.
ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా రిలీజింగ్ డేట్ ను కూడా విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆనందింప చేశారు చిత్రం యూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇదివరకే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న మరొక సమాచారం ప్రకారం.. ఇండియా మొత్తం మీద థియేటర్లు, స్క్రీన్స్ అన్నింటిని కలుపుకొని సుమారుగా 9500 స్క్రీన్స్ ఉన్నాయి.. అందులో 6,500 సింగిల్ స్క్రీన్ థియేటర్లు .. మిగతావి మల్టీప్లెక్స్ స్క్రీన్లు. కరోనా కారణంగా కొన్ని సింగిల్ స్క్రీన్ లను గోడౌన్, షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న వాటిలో వీలైనంత స్క్రీన్ లలో ఆది పురుష్ సినిమా ప్రదర్శించేలా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక ఒక్కో థియేటర్లో ప్రతిరోజు నాలుగు ఆటలు వేస్తారు.. ఐదు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే రోజుకు 40 షోలు వేయొచ్చు.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. 8000 థియేటర్లలో ఆది పురుష్ సినిమా విడుదల చేస్తే కొన్ని థియేటర్లలో నాలుగు షోలు , మరికొన్నింటిలో ఐదు షోలు వేస్తే రోజుకు 35వేల కంటే ఎక్కువ షో లు పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలోనే భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్రం యూనిట్.. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.