ఆరోగ్య శ్రీ కార్డు దారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం శుభ‌వార్త‌..

ఆరోగ్య శ్రీ ప్యాకేజీని రూ. 2 ల‌క్ష‌ల నుంచి రూ 5 లక్షలకు తెలంగాణ ప్రభుత్వం పెంచింద‌ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ లో ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తున్నామ‌ని.. దేశంలో వైద్యరంగంలో అతి ఎక్కువ ఖర్చు పెడుతున్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఉందని ఆయ‌న వెల్ల‌డించారు.

harishrao
harishrao

ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉందని చెబుతున్నారు… రేపు సాయంత్రం సమీక్ష చేయబోతున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ఆక్సిజన్, బెడ్స్, థర్డ్ వేవ్ అప్రమత్తంపై రేపు సీఎస్ తో కలిసి అన్ని శాఖలతో డిటైల్డ్ గా చర్చిస్తామ‌ని తెలిపారు హరీష్ రావు. రేపు ఉస్మానియా ఆస్పత్రిలో సిటీ స్కాన్, క్యాథల్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్ల‌డించారు.

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స చేయాలని నీలోఫర్ డాక్టర్లకు సూచించామని.. కర్ణాటక నుంచి కొందరు రిఫర్ పై వస్తున్నారని చెప్పారు. వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించాలని చెప్పానని ఆయ‌న వివ‌రించారు. సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వాలని డాక్టర్లకు సూచించాం. ప్రతినెల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, అందులో ఎంత మేర సాధించారో నివేదిక ఇవ్వాలని కోరాము. ప్రతినెల కచ్చితంగా పురోగతి ఉండాలని స్పష్టం చేశామని… నెల నెలా సమీక్ష చేస్తామ‌న్నారు.