బ్రేకింగ్ : వికేంద్రీకరణ బిల్లుపై ఉద్యోగులు పిటిషన్..?

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన వికేంద్రీకరణ పై ఇంకా ఆంధ్ర రాజకీయాల్లో చర్చ కొనసాగుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. రాజధాని వికేంద్రీకరణ అడ్డుకోవాలంటూ అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో రాజధాని అమరావతిలో రైతులందరూ ఉద్యమ ఆపకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా రాజధాని వికేంద్రీకరణ బిల్లు పై.. సచివాలయ ఉద్యోగులు అందరూ హై కోర్టు మెట్లేక్కారు.

హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన సచివాలయ ఉద్యోగుల సంఘం.. ఆసక్తికర విషయాలను పిటిషన్ లో పేర్కొన్నారు. రాజధాని అనేది భూములిచ్చిన రైతులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని… రాజధాని ఎక్కడ ఉండాలి అని నిర్ణయించేందుకు ప్రభుత్వమే కానీ రైతులు కాదు అంటూ పేర్కొన్నారు. అమరావతి లో 70శాతం రాజధాని నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆరోపించడం అవాస్తవం అంటూ వ్యాఖ్యానించింది సచివాలయ ఉద్యోగుల సంఘం. కొందరు తమ రియల్ఎస్టేట్ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మాత్రమే హైకోర్టులో పిటిషన్ వేశారు అంటూ పిటిషన్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news