తెలంగాణ రైతన్నల కు భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు మాత్రమే వేయాలని ఇక మీదట భవిష్యత్తులో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దొడ్డు బియ్యం కొనదు అని పౌరసరఫరాల సంస్థ తెలంగాణ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు నిజానికి ఈ సీజన్లో దొడ్డు బియ్యం కొనేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందు అంగీకరించలేదు అని ఆయన పేర్కొన్నారు.
కానీ తెలంగాణ రైతన్నల కష్టం తెలిసిన కెసిఆర్ దొడ్డు బియ్యం కొనేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి వారిని ఒప్పించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కొనుగోలు జరిగిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ఆయన అన్నారు. దొడ్డు బియ్యం వేసి దానిని అమ్ముకోలేక ఇబ్బందులు పడవద్దు అని ఆయన రైతులకు సూచించారు. ఇక మీదట ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనకపోతే ప్రభుత్వాన్ని నిందించవద్దని ఆయన చెప్పుకొచ్చారు.