అన్ లాక్ లో భాగంగా హోటళ్ళు, బార్లు, ఫంక్షన్ హాల్లు తెరుచుకున్నాయి కాఅనీ థియేటర్లు మాత్రం తెరుచుకోలేదు. 50శాత సీటింగ్ తో థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పినప్పటికీ థియేటర్ల యజమానులు ముందుకు రావడం లేదు. తక్కువ సీటింగ్ కెపాసిటీతో నడిపిస్తే మరింత నష్టపోతామన్న కారణంగా ఎవరూ ముందుకు రావట్లేదు. అదీగాక, కొత్త సినిమాలని రిలీజ్ చేయడాన్నికి చిత్ర నిర్మాతలు ముందుకు రావడం లేదు. సో.. థియేటర్లు ఇంకా మూసే ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం డిసెంబరులో థియేటర్లు తెరుచుకోబోతున్నాయట. డిసెంబరు 4వ తేదీ నుండి హైదరాబాద్ లో థియేటర్లు తెరుచుకుంటాయని అంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు డిసెంబరులో రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని థియేటర్లు డిసెంబరు 4వ తేదీ నుండి, మరికొన్ని డిసెంబరు 11వ తేదీ నుండి తెరుచుకోనున్నాయట. సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటరు చిత్రం డిసెంబరులో రిలీజ్ అవుతుందన్న సంగతి తెలిసిందే.