థియేట్రికల్ బిజినెస్: రెడ్డి మీద వీరయ్యదే పైచేయా..?

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే పోటీ అనేది కచ్చితంగా ఉండాలి. అప్పుడే నటీనటులు కూడా అభిమానుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా అభిమానులు ఈ పోటీని కోరుకుంటున్నారు. ఇక బాలకృష్ణ , చిరంజీవి మధ్య చాలా సంవత్సరాల నుంచి పోటీ ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ నేరుగా 8సార్లు సంక్రాంతి బరిలో పోటీ పడగా .. ఐదుసార్లు మిగతా సందర్భాలలో పోటీపడ్డారు. అయితే ఇప్పుడు కూడా మరొకసారి సంక్రాంతి పండుగకు పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా ఈనెల 12వ తేదీన విడుదలవుతోంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమాల నుంచి విడుదలైన ట్రైలర్లు, పాటలు అన్నీ కూడా అంచనాలను మరింత పెంచాయి . అయితే తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు ఇప్పటికే పోటీపడుతున్నారు. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీర సింహారెడ్డి పై వాల్తేరు వీరయ్య సినిమాదే పైచేయిలా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా నే ముందంజలో ఉండడం గమనార్హం.

వీర సింహారెడ్డి సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల మేరా థియేట్రికల్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . కానీ వాల్తేరు వీరయ్య మాత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిందని సమాచారం. దీన్ని బట్టి చూస్తే రూ.19 కోట్ల మేర వీర సింహారెడ్డి సినిమా పై వాల్తేరు వీరయ్య సినిమా పై చేయి సాధించింది. సీడెడ్, నైజాం, ఉత్తరాంధ్ర తోపాటు ఇతర ప్రాంతాలు కలుపుకొని వాల్తేరు వీరయ్య రూ.74 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా వీరసింహారెడ్డి రూ.60 కోట్ల బిజినెస్ చేసింది. మరి ఈ రెండు సినిమాలు ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news