అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ తాము అభివృద్ది చేసిన వ్యాక్సిన్.. మానవులపై చేసిన పరీక్షల్లో తమ టీకా 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని ఫైజర్ ప్రకటించిన్నట్లు తెలిసిన విషయమే. అయితే తాజా డోనాల్డ్ ట్రంప్ దీని పై ఘాటుగా స్పందించారు. ఎఫ్డీఏ, ఫైజర్ కలిసి ఎన్నికల్లో తనకు విజయం దక్కకూడదని ఇలా చేశారని ఆరోపించారు. వ్యాక్సిన్ ఎప్పుడో సిద్ధమైందని, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ (ఎఫ్డీఏ) అధికారులతో కుమ్మక్కయి ఫలితాలను ప్రకటించలేదని ట్రంప్ దుయ్యబట్టారు.
ఆమెరికాలోని అధ్యక్ష ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ తీసుకువస్తామని ట్రంప్ గతంలో ఒక ప్రకటన విడుదల చేశారు. కానీ, టీకా అందుబాటులోకి రాకపోవడంతో అంచనాలు మాత్రం తల్లకిందులయ్యాయి. కరోనా వ్యాక్సిన్ ముందే వస్తే డెమొక్రాట్లు ఇష్టపడటంలేదని అందుకే సంస్థ అధికారిక ప్రకటన ఆలస్యంగా ఇచ్చిందని ట్రంప్ తీవ్రంగా విమర్శలతో ట్వీట్ చేశారు.
“ఎన్నికల్లో నాకు ‘కరోనా వ్యాక్సిన్ విజయం’ దక్కకూడదని ఎఫ్డీఏ, డెమొక్రాట్లు భావించారు. నేను చెబుతూనే వస్తున్న.. ఎన్నికల తర్వాత టీకా ప్రకటన చేస్తారని.. ఇప్పుడు 5 రోజుల తర్వాత చేశారు. కానీ, ఈ పని ముందే చేసి ఉండాల్సింది” ఆవేదన వ్యక్తం చేశారు.
జో బెడన్ అధ్యక్షుడైతే మరో నాలుగేళ్లైన వ్యాకిన్ రాదని దుయ్యబట్టారు. వారి వైఖరితో లక్షలాది ప్రాణాలను ప్రమాదంలో పెట్టారని విమర్శించారు. యూఎస్ ఎఫ్డీయే సైతం రాజకీయ ప్రయోజనాలనే చూసుకుందని’ అని అన్నారు. కరోనా పై మానవ పోరాటం ఇంకా ముగియలేదని, ఈ పోరాటం మరీంత కాలం కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు వైరస్ ని ఎదుర్కునేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు అభీనందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఫైజర్ చేసిన ప్రకటన జాతికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని వ్యాఖ్యనించారు.