చంద్రబాబు అరెస్ట్ లో కేంద్రం హస్తం లేదు: నారా లోకేష్

-

నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి చాలా విషయాలు తెలుసుకుని వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తన తండ్రి మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ కాబడిన ఘటనలో కీలక పాత్ర ఎవరిది అన్న విషయాన్నీ కూడా కనుగునేందుకు వెళ్ళాడు. కాసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ… జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా మా నాన్న అరెస్ట్ లో కేంద్ర ప్రభుత్వం హస్తం ఉందని నేను అనుకోవడం లేదు.. అందుకు తగిన ఆధారాలు కూడా కనిపించడం లేదంటూ చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ రాజకీయ నాయకులు కొందరు ఈ అరెస్ట్ కు మరియు మోడీకి సంబంధం ఉందని, ఆయన తెరవెనుక ఉండి మొత్తం నడిపిస్తున్నారని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ బీజేపీ అగ్రనేతలు కలిసి ఇలా లోకేష్ ను చెప్పమన్నారా అంటూ సందేహాలను తీసుకువస్తున్నారు.

మరి ఈ అరెస్ట్ విషయంలో ఎవరైనా ఉన్నారా ? లేదా తమకు చేసిన తప్పులే కారణమా అన్నది తెలియాలంటే కోర్టులు తీర్పులు ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news