ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం మొదలైన క్యాబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది.ఈసీ కేబినెట్ భేటీకి అంక్షలతో కూడిన అనుమతి ఇవ్వడంతో కేవలం అత్యవసర అంశాలతో పాటు కీలకమైన విషయాలపై మాత్రమే చర్చించారు. సమావేశం అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడిగడ్డ బ్యారేజీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికపై కేబినెట్ భేటీలో చర్చించామని వెల్లడించారు.
మేడిగడ్డకు మరమ్మత్తులు చేసిన ఉంటుందనే గ్యారెంటీ లేదని కమిటీ చెప్పిందని వెల్లడించారు. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజీలో నీరు నిల్వ చేసే పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ చెప్పిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. తాత్కాలికంగా ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైతులకు సాగు నీరు ఇవ్వాలని భావిస్తున్నామని తెలిపారు.