ఏపీలో స్థానిక ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న వాదనలు ఇవి! అవును.. ఎంత కరోనా అయినా మిగిలిన రాష్ట్రాల్లో ఏకంగా అసెంబ్లీ, పార్లమెంటులకే ఎన్నికలే జరుగుతున్నప్పుడు.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు! అయితే దీనికి రెండు సమాధానాలు వస్తున్నాయి..!!
అవును… ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం జగన్ ఏమాత్రం ఇష్టం లేదు.. అందుకు కారణం నిమ్మగడ్డ నేతృత్వంలో జరగడం ఆయనకు ఇష్టం లేదు అని! సపోజ్ ఫర్ సపోజ్ అదే నిజమైతే… జగన్ ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నిమ్మగడ్డ ఎంత ఎన్నికల కమిషనర్ అయినా… ఎన్నికలు నిర్వహించేది తానే అయినా… ఆ బాధ్యతలు నిర్వర్తించాల్సింది జగన్ ప్రభుత్వంలోని కలెక్టర్లు, ఎస్పీలు! జగన్ కి ఇంకా నాలుగేళ్లు అధికారం ఉంది!
సపోజ్ ఫర్ సపోజ్ నిజంగా నిమ్మగడ్డ సరైన రీతిలో ఎన్నికలు నిర్వహించని పక్షంలో కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నారు. సో.. ప్రాబ్లం లేదు! పైగా ఈ సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా ప్రతిపక్షం వీక్ గా ఉంది! ఇంతకు మించిన సువర్ణావకాశం ఏ అధికారపార్టీకి రాదు! మరి జగన్ కు ఉన్న సమస్య ఏమిటి? కేవలం నిమ్మగడ్డను బొమ్మలా కూర్చోబెట్టి పంపేయాలనే ఆలోచన మాత్రమేనా?
సపోజ్ ఫర్ సపోజ్… ఈ సమయంలో నిమ్మగడ్డ రూల్స్ కి వ్యతిరేకంగా, చంద్రబాబుకి అనుకూలంగా ప్రవర్తిస్తే.. అంతకుమించిన ఆత్మహత్యా సదృశ్యం మరొకటి ఉండదన్న విషయం నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి తెలియంది కాదు. ఎందుకంటే.. ఇప్పటికే ఆయనకు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది.. అది కూడా మెజారిటీగా స్వయంకృతాపరాధాలే! కాబట్టి ఈ సమయంలో జగన్ కాస్త ఆలోచించి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తేనే బెటరనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!