లవ్ లో ప్రేమ లేదు..కేవలం సె**క్స్ మాత్రమే వుంది.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్..!!

-

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సిటీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వివాదాలలో తలదూరుస్తూ పలు రకాల కామెంట్లు చేస్తూ బాగా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక తెలుగులో అవకాశాలు లేకపోవడంతో పలు స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వారిపై విచక్షణ రహితంగా ఈమె మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురి కావడంతో తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లిపోయి అక్కడే అడపాదడపా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఇక ఈమె ఎక్కువగా హాట్ అందాలతో కుర్రాకారుకు నిద్ర లేకుండా చేస్తూ.. వరుస ఫోటోషూట్లతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఏమైందో తెలియదు కానీ గత కొద్ది రోజుల నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ చెన్నైలోని తన స్నేహితురాలి తోటలో పచ్చని చెట్ల మధ్య ఘుమ ఘుమ లాడే వంటలు తయారు చేస్తూ మరోపక్క వయ్యారాలు వొలకబోస్తూ యూట్యూబ్లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది.

మొన్నటికి మొన్న రాయలసీమ నాటుకోడి.. రాగిసంకటి చేసి మంచి రుచి చూపించిన ఈమె ఇప్పుడు తాజాగా బోటీ కూర వండి.. మంచి రుచిని ఆస్వాదించేలా చేసింది. ఇక అంతే కాదు తాను తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని ఇబ్బందులను అలాగే సమాజంలో తాను చూసిన సమస్యలను కూడా ఈ వీడియో ద్వారా వెల్లడించింది శ్రీరెడ్డి. ఇకపోతే ఇటీవల ఆమె హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన తలచుకొని పూర్తిగా ఎమోషనల్ అయింది. ఒక కామోన్మాధి ఒక అమ్మాయిని ప్రేమించి ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి.. ప్రెగ్నెంట్ ని చేశాడు. ఇక తర్వాత వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమె కడుపు తీయించుకోలేని స్టేజ్ కు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక ఆ అమ్మాయి కడుపు తీయించుకుందామని వెళ్తే ఇద్దరిలో ఒకరే మిగులుతారని వైద్యులు చెప్పడంతో.. ఇక ఆ అమ్మాయి పరిస్థితి చూసి చాలా బాధ అనిపించింది. తల్లిదండ్రులు కూడా ఆమెను ఆదరించలేదు.

ఇక మాలాంటి వాళ్ళు ఇలాంటి మచ్చలను ఎన్నో అనుభవించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో లవ్ లో ప్రేమ లేదు..కేవలం సె**క్స్ మాత్రమే వుంది అంటూ.. ఇక లవ్ మ్యారేజ్ కన్నా పెద్దలు కుదిర్చిన అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడమే చాలా మంచిది అంటూ ఈ వీడియో ద్వారా ఎమోషనల్ కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో బాగా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news