ప్రొటెమ్ స్పీకర్ ఎంపికలో ఎలాంటి రాజకీయ కోణం లేదు : మంత్రి ఉత్తమ్

-

అక్బరుద్దీన్ ని ప్రొటెమ్ స్పీకర్ గా ఎన్నుకోవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెమ్ స్పీకర్ గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయకపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నకు ఉత్తమ్ రియాక్ట్ అయ్యారు.సభలో సీనియర్ వ్యక్తీ ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహరించడం ఆనవాయితీ అని, నార్మల్ గా అయితే నేనే ప్రొటెమ్ స్పీకర్ గా ఉండాల్సిందని తెలిపారు.

అయితే నేను మంత్రిగా ఉండటం చేత మరో సీనియర్ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహరించారన్నారు. రాజ్యాంగ బద్ధంగా అసెంబ్లీ ప్రొసీజర్ కి లోబడే ఓవైసీ నియామకం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కువ మెజార్టీ లేకపోవడం వల్లే సంఖ్యా బలం కోసం ఎంఐఎం ఎమ్మెల్యేకు ప్రొటెమ్ స్పీకర్ పదవి ఇచ్చారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెమ్ స్పీకర్ కావడం ఎలాంటి రాజకీయ సంకేతం కాదన్నారు. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాలను, మతాలను కలుపుకుపోయే పార్టీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news