సలార్ మూవీ రన్ టైమ్ ఎంతంటే..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా మూవీ సలార్. ఇప్పటికే ఈ సినిమా రెండు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది. కొన్ని రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేయగా మిక్స్డ్ రెస్పాన్స్ లభించింది. దీంతో ఫాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. ఇప్పుడు సెన్సార్ రిపోర్టు మాత్రం అంచనాలను పెంచే విధంగా కనిపిస్తోంది.

డిసెంబర్ 1 ట్రైలర్ రిలీజ్ చేయగా ఇందులో ప్రభాస్ లేట్ ఎంట్రీ తో పాటు యాక్షన్ తప్పితే పంచ్ డైలాగ్స్ లాంటివి లేకపోవడంతో అభిమానులు కాస్త డిసప్పాయింట్ అయ్యారు. దీంతో రాబోయే వీకెండ్ ప్రభాస్ మాత్రమే ఉండే విధంగా యాక్షన్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారట. దీనికి తోడు సలార్ సెన్సార్ పూర్తయిందని న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సెన్సార్ ప్రకారం సలార్ నిడివి రెండు గంటల 55 నిమిషాల 22 సెకండ్లు. ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news