ఫేక్ వీడియోలను విడుదల చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదు….మోడీ స్ట్రాంగ్ వార్నింగ్

-

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు చేసుకునే విమర్శలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే ఈ ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే మార్ఫింగ్ చేసి అప్ లోడ్ చేసిన వీడియోపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…మార్ఫింగ్ వీడియోను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు.. పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోడీ సీరియస్ అయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో పై ప్రధాని మోడీ స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లును బీజేపీ తీసేస్తుందని మార్ఫింగ్ వీడియో విడుదల చేసి ప్రజల్లో ఆందోళన కలిగించాలని కాంగ్రెస్ చూస్తోందని ప్రధాని మండిపడ్డారు. ఫేక్ వీడియోలను రిలీజ్ చేసిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదని.. ప్రధాని కాంగ్రెస్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news