అక్కడ.. రిజర్వేషన్లను లాక్కుని కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చింది.. అమిత్ షా ఫైర్

-

ప్రతిపక్ష కాంగ్రెస్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. హర్యానాలోని మహేంద్రగఢ్‌లో మంగళవారం ఆయన పర్యటించారు. మహేంద్రగఢ్‌లో జరిగిన ”బీసీ సమ్మాన్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడుతూ.. ఇతర వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు 1950లలో ఏర్పాటు చేసిన కాకా కలేకర్ కమిషన్ గురించి అమిత్ షా ప్రస్తావించారు. కాంగ్రెస్ సంవత్సరాల తరబడి కమిషన్ సిఫారసులను అమలు చేయలేదని మండిపడ్డారు.

1980లో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ‘మండల్ కమిషన్’ని కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారని, 1990లో దానిని ఆమోదించిన సమయంలో, రాజీవ్ గాంధీ రెండున్నర గంటలు ప్రసంగించి ఓబీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించారని ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలో వెనకబడిన వర్గాల రిజర్వేషన్లను లాక్కుని కాంగ్రెస్ ముస్లింలకు ఇచ్చిందని విమర్శించారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. హర్యానాలో ముస్లింలకు రిజర్వేషన్లు అనుమతించబోమని తాను హామీ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.హర్యానాలో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఈ ఏడాది చివర్లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news