కేసీఆర్ తో సీట్ల సర్దుబాటు చర్చ జరగలేదన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. బీజేపీ ని ఎదుర్కొనే శక్తి కాంగ్రెస్ కి ఉంటే.. ఆ పార్టీతోనే కలిసి పని చేస్తామన్నారు. బిఆర్ఎస్, తాము వేరువేరు పార్టీలు అని.. వాళ్ళు పోటీ చేస్తాం అంటారు.. మేము పోటీ చేస్తాం అంటామని, ఎన్నికల్లో కలిసి పని చేయడం వేరు.. సీట్ల సర్దుబాటు వేరని స్పష్టం చేశారు. కలిసి పని చేయాలి అని అనుకున్నప్పుడు.. సీట్ల ఒప్పందం తరవాత సహకరించుకుంటామన్నారు.
సీపీఐ, సీపీఎం లను వ్యతిరేకించే కమ్యూనిస్టుల విమర్శలు విన్నామని.. మా బలానికి తగ్గ సీట్లలో పోటీ చేస్తామన్నారు. బిఆర్ఎస్ మాతో కలిసి వస్తే కలిసి పని చేస్తామన్నారు. లేదంటే మా బలం ఉన్న చోట పోటీ చేస్తామని స్పష్టం చేశారు. కలిసి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు తమ్మినేని.