రేవంత్‌ వర్సెస్ ఉత్తమ్..హస్తంలో ఆగని పంచాయితీ.!

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుపడేలా లేదు. ఆ పార్టీని ప్రత్యర్ధులు దెబ్బకొట్ట అవసరం లేదు..సొంత పార్టీ వాళ్ళే దెబ్బకొడుతున్నారు. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది. ఇప్పటికే తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు ధీటుగా బి‌జే‌పి రేసులోకి వస్తుంది. క్షేత్ర స్థాయిలో బలం లేకపోయినా బి‌జే‌పి దూకుడుగా ఉంది. ఇక క్షేత్ర స్థాయిలో బలం ఉండి కూడా కాంగ్రెస్ ఏం చేయలేని పరిస్తితి. దీని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా గెలవడం కష్టమనే పరిస్తితి.

ఇప్పటికే ఆధిపత్య పోరు పెరిగిపోయింది..అయినా సరే అది ఎక్కడ బ్రేక్ పడటం లేదు. ఎప్పుడు ఏదొక పంచాయితీ నడుస్తూనే ఉంది ఈ పంచాయితీలు కారణంగానే కొందరు నేతలు కాంగ్రెస్ వదిలి వెళ్లిపోతున్నారు. ఇటీవల ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్స్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మంచిర్యాలలో జరిగిన కాంగ్రెస్ సభలో జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఎదుటే రేవంత్ రెడ్డి వర్గం వర్సెస్ సీనియర్లు అన్నట్లు పరిస్తితి ఉంది.

ఇప్పటికే రేవంత్ రెడ్డి అంటే సీనియర్లకు పడటం లేదు. ఇటు రేవంత్ సైతం సీనియర్లకు చెక్ పెడుతున్నారనే టాక్ ఉంది. ఇలాంటి పరిస్తితుల్లో తాజాగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఈ నెల21వ తేదీన నల్గొండలోని ఎం‌జి యూనివర్సిటీలో నిరుద్యోగ నిరసన సభ ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.

అసలు తన స్థానంలో…తనని సంప్రదించకుండా కార్యక్రమం పెట్టడం ఏంటి అని ఉత్తమ్ ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఉత్తమ్..రేవంత్ పాయి రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్ థాక్రేకు కూడా ఫిర్యాదు చేశారని తెలిసింది.  ఇలా ఇద్దరి మధ్య పంచాయితీ మొదలైంది. ఇవి సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇబ్బంది లేదు..లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకా డ్యామేజ్ తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news