నకిలీ వార్తల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రోజు రోజుకీ నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయి ఈ నకిలీ వార్తల తో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఇప్పటికే ఎంతగానో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. కరోనా వచ్చినప్పటి నుండి కరోనా మహమ్మారి చాలా మందిని బలితీస్తుంది. మరొకసారి కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు అనుసరించినట్టు సోషల్ డిస్టెన్స్ పాటించడం.
ఒకవేళ బయటకు వెళ్తే ఖచ్చితంగా మాస్కు ధరించండి హైజీన్ ని ఫాలో అవుతూ ఉండండి. కరోనా కేసులు మళ్ళీ వస్తుండడంతో ఫేక్ వార్తలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త వచ్చింది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. డైలీ ట్రెండింగ్ న్యూస్ ఛానల్ కరోనా కి సంబంధించి ఒక వార్తని ప్రచారం చేస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండడంతో మే నెలలో ఇండియా లాక్ డౌన్ అని ఆ యూట్యూబ్ ఛానల్ ప్రచారం చేస్తుంది మరి ఆ యూట్యూబ్ ఛానల్ లో చెప్పింది నిజమా కాదా..
'Daily Trending News' नामक #YouTube चैनल के एक वीडियो में दावा किया जा रहा है कि #कोरोनावायरस संक्रमण के बढ़ने के कारण मई में भारत में लगेगा लॉकडाउन#PIBFactCheck
▶️ यह दावा #फ़र्ज़ी है
▶️ कृपया फ़र्ज़ी खबरों से सावधान/सतर्क रहे एवं ऐसी खबरों को आगे साझा न करें pic.twitter.com/tjIUmtmsaW
— PIB Fact Check (@PIBFactCheck) April 17, 2023
ఇది నకిలీ వార్తా లేకపోతే నిజమేనా అనేది చూస్తే.. ఈ యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వార్త నకిలీ వార్త. ఇది నిజం కాదు మే నెలలో లాక్ డౌన్ పెట్టాలని ప్రభుత్వం ఏమి అనౌన్స్ చేయలేదు. ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి అనవసరంగా ఇతరులకి కూడా పంపి వాళ్ళని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేయకండి. నిజమైన వార్త ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా అవసరం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించి ఇది వట్టి నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.