జనగామ నియోజకవర్గ భువనగిరి లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో తన ఓటమికి గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకుర్తిలో ఏడు సార్లు నేనే ఉన్న కాబట్టి ఈసారి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వలనుకున్నారు అని అన్నారు. అంతేగాని నాపై వ్యతిరేకతతో కాదని ఆయన అన్నారు. నన్ను పాలకుర్తి ప్రజలు వద్దనుకోలేదని, నియోజకవర్గం లో నేను గెలిస్తే జైల్లో పెడతానని,చెప్పుడు మాటలతో వదంతులు సృష్టించారని అన్నారు.
సీనియర్ ఎన్టీ రామారావునే అప్పుడు ఓడించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోస పోయారని విమర్శించారు. క్రిష్ణా జలాల వివాదం కాంగ్రెస్ పార్టీలో మొదలయింది, రేపు రేపు గోదావరి జలాల వివాదం కూడా వస్తదని అన్నారు.టిఆర్ఎస్ ప్రభుత్వం లేదని బాధపడవద్దని,మీకు మా అండదండలు ఉంటాయి, ఏ కష్టం వచ్చిన ఆదుకుంటామని హామీ ఇచ్చారు.