గన్నవరం నుంచి చెన్నైకు కు వచ్చే వారం నుంచి ఒక విమానా సర్వీస్ నడవనుంది. కరోనా కారణంగా నాలుగు నెలలుగా చెన్నైకు విమానాలు ఆగిపోగా, ఈనెల రెండో వారం నుంచి ఓ సర్వీస్ నడవనుందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల విమానాల రాకపోకల సంఖ్యను 45 నుంచి 65 శాతానికి పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
దీనిని ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) కూడా ఆచరణలో పెట్టడానికి రెడీ అయింది. ఈ నేపధ్యంలోనే విజయవాడ- చెన్నై విమానాలు నడవటానికి రంగం సిద్దం చేసారు. ఈనెల 8వ తేదీన చెన్నైకు తొలి విమానం ప్రారంభంకానుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయం నుంచి 9 విమాన సర్వీసులు నడవగా మరో విమానానికి అవకాశం ఇవ్వడంతో 11 కి చేరుకున్నాయి. బెంగళూరుకు నాలుగు, హైదరాబాద్కు నాలుగు, వారంలో రెండు రోజుల పాటు ఢిల్లీకి ఒక విమానం నడుస్తుంది.