ఏపీ రాజధాని మార్పు ఉండదు; అమిత్ షా…?

ఆంధ్రప్రదేశ్ రాజధాని మార్పు ఉండదు. దీనిలో రెండవ ఆలోచన లేదు.ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ని గుర్తించాo, మ్యాప్ లో కూడా పొదుపరిచాము. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ పరచండి. మనం మార్పు ప్రకటన ఏమి చేయలేదు కాబట్టి మనం ఏమి మాట్లాడవలిసిన అవసరం లేదు. ప్రజల్లో గందరగోళం పోవటానికి మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మోకిక ఆదేశాలు ఇవ్వండి. ప్రధానమంత్రి కూడా ఈ విషయం లో ఇదే అభిప్రాయం మీద ఉన్నారు..

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న పోస్ట్ ఇది. సోషల్ మీడియాలో… దీనిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. రాజధాని మార్పు విషయంలో ముందు నుంచి కూడా కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో అర్ధం కాక అక్కడి ప్రజలు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజధాని మార్పు అనేది ఖర్చు తో పాటుగా నష్టం తో కూడుకున్న వ్యవహారం అని విపక్షాలు అంటున్నారు.

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దీనికి సంబంధించి మాకు ఎలాంటి సంబంధం లేదని మేము అమరావతిని రాజధానిగా గుర్తించాం అని కేంద్రం చెప్పింది. ఇక ఇప్పుడు ఈ గైడ్ లైన్స్ ని… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి… కిషన్ రెడ్డి కి హోం శాఖా మంత్రి అమిత్ షా ఇచ్చారు అని సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. ఇది నిజమో కాదు తెలియదు గాని టీడీపీ మాత్రం దీని మీద చాలా ఆశలు పెట్టుకుంది.

అయితే కరోనా సమయంలో ఆయన ఆ ప్రకటన ఎందుకు చేస్తారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర విషయం. కరోనా ప్రభావం అనేది ఏపీలో చాలా ఎక్కువగానే ఉందీ అనే విషయం అర్ధమవుతుంది. కేసులు రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి. లాక్ డౌన్ కూడా అమలు చేస్తున్నారు. మరి ఈ సమయంలో ఎందుకు ప్రజలకు ధైర్యం కేంద్రం కల్పిస్తుంది… ఏది ఎలా ఉన్నా దీన్ని మాత్రం టీడీపీ సోషల్ మీడియా బాగానే నమ్మింది.