జగన్ కీలక నిర్ణయం… జిల్లాల విషయంలో ముందుకే…!

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు జిల్లాల విషయంలో దూకుడుగా వెళ్ళాలి అని భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పరిపాలనా సౌలభ్యం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. రాజధానిని కూడా మార్చాలని భావిస్తూ విశాఖను పరిపాలానా రాజధానిగా… అమరావతిని శాసన రాజధాని గా చెయ్యాలి అని, అలాగే కర్నూలు ని న్యాయ రాజధానిగా చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే ప్రజలకు మంచి పాలన అందించాలి అని భావిస్తున్న వైఎస్ జగన్… రాజధాని విషయంలో ముందుకి వెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలి అని భావిస్తున్న జగన్ ఈ విషయంలో ఇప్పుడు కీలక అడుగు వేసినట్టు సమాచారం. జిల్లాల ఏర్పాటుని ఆయన కీలకంగా తీసుకుని నాలుగు నుంచి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా చెయ్యాలి అని చూస్తున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా పరిగణించాలి అవసరం అనుకుంటే అని కేంద్రం అంటుంది. ఇప్పటికే నిధులు ఇచ్చే విషయంలో తాము అదే విధానం ఫాలో అవుతామని కూడా కేంద్రం చెప్పేసింది. దీనితో జగన్ ఒక కమిటిని ఏర్పాటు చేసి ఆ కమిటిని రాష్ట్ర వ్యాప్తంగా పంపాలని యోచిస్తున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఈ విషయంలో ఆయన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.

ఉత్తరాంధ్ర ను ఆయన ఆరు జిల్లాలు చెయ్యాలి అని చూస్తున్నారు. అక్కడ పార్లమెంట్ నియోజకవర్గాలు నాలుగు ఉన్నాయి. ఇప్పుడు జిల్లాలను ఆరు చెయ్యాలి అని చూస్తున్నారు. అరకుని జిల్లా చెయ్యాలి అని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసే సూచనలు ఉన్నాయి. రెండు నెలల్లో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వెంటనే ఈ విషయంలో ముందుకి వెళ్ళే యోచనలో జగన్ ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news