కూరగాయాల్లో చాలావరకు అందరూ హేట్ చేసే కూరగాయ ఏదైనా ఉంది అంటే.. అది క్యాబేజి.. క్యాబేజీ ఎలా ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి… పొరలు పొరలుగా తీస్తున్న కొద్ది ఆకులు వస్తూనే ఉంటాయి. అలాగే ఓ నగరంలోని ప్రజలు డ్రెస్సుల మీద డ్రెస్సులు వేసుకొని క్యాబేజీల్లా కనిపిస్తారు… అలా వేసుకోకపోతే వారు ఆ చల్లదనానికి గడ్డకడతారు.. భూమిపై అత్యంత శీతల నగరంగా రికార్డు సాధించిన ఊరు యాకుట్స్. ఇక్కడ బతకడం అంటే..చలితో సావాసం చేయడమే..కొత్తవాళ్లు వెళ్తే అక్కడ అసలు ఉండలేరట..!
రష్యాలోని మాస్కోకు తూర్పు వైపుగా 5000 కిలోమీటర్ల దూరంలో ఈ ఊరు ఉంది. శీతాకాలంలో ఈ నగరంలోని ఉష్ణోగ్రతలు మైనస్ 40 నుంచి మైనస్ 50 వరకు చేరతాయి.. అప్పుడు మనుషుల కనురెప్పలు కూడా గడ్డకట్టుకుపోతాయి. తినే తిండి నిమిషాల్లో మంచులా మారిపోతది. అందుకే వారు కిటికీలు కూడా తెరవకుండా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి.. మార్కెట్ల నిండా మంచు పేరుకుపోతుంది. వారికి అసలు ఫ్రిడ్జ్‌తో పనేలేదు.. మాంసాహారం ఎన్ని రోజులైనా తాజాగా ఉంటుంది. అప్పుడే వలవేసి తెచ్చిన చేపలు కూడా ఈ మంచుకి… గట్టిగా గడ్డల్లా అయిపోతాయి..
ఈ నగరంలో 336,274 మంది నివసిస్తున్నారు. అక్కడ అధిక ఉష్ణోగ్రత అంటే 18 డిగ్రీల ఫారెన్ హీట్ మాత్రమే. అంతకుమించి అక్కడ ఎప్పుడూ అధిక ఉష్ణోగ్రతలు నమోదుకాలేదు… అంటే ఏడాది పొడవునా చల్లగానే ఉంటుంది. మంచు కురుస్తూనే ఉంటుంది. అందుకే వారికి ఆ మంచు అలవాటైపోయింది
మల్టీక్లాత్ లేకపోతే..గడ్డలే..!!
చేతులకు రెండు జతల గ్లౌజులు, తలకి మూడు నాలుగు టోపీలు, ఒంటిపై రెండు మూడు హుడీలు వేసుకుంటారు ఇక్కడి ప్రజలు.. మేము ఈ చలికి అలవాటైపోయాం, మా మెదడు కూడా మమ్మల్ని ఈ విధంగా సిద్ధం చేసింది. ఇది మాకు చాలా సాధారణంగా అనిపిస్తుందని అక్కడివారు అంటున్నారు.. ‘ఫ్రిడ్జ్, ఫ్రీజర్ల అవసరం మాకు పడదు. వేసవికాలంలో కూడా ఫ్రిజ్ అవసరం మాకు ఉండదు’ అని చెబుతున్నారు యాకుట్స్ నగర ప్రజలు.