టాలీవుడ్ లో బాగా ఫేమస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో అత్యధిక గుర్తింపు ఉన్న యాంకర్లు ఎవరు అంటే రష్మీ, ప్రదీప్, రవి ,అనసూయ, సుమ వీళ్ళ పేర్లే ఎక్కువగా చెబుతూ ఉంటారు. అంతలా తెలుగులో క్రేజ్ సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ఈవెంట్ జరిగిన యాంకర్ లు పాత్ర చాలా కీలకం.. వారు లేకుండా ఏ ఫంక్షన్ కూడా ఊహించుకోలేరు.. మరి అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకుని పారితోషకం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే వారు ఒక్క ఈవెంట్ కి తీసుకునే పారితోషకం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి వారి పారితోషకం ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
సుమా కనకాల:
ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ఈమె ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటివరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ హాజరయ్యే ఒక ఈవెంట్ కు దాదాపుగా రూ.3 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుంది.
ప్రదీప్ మాచిరాజు:
మేల్ యాంకర్స్ లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు
టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఇతడు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కు 1లక్ష రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు.
అనసూయ భరద్వాజ్:
జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్ ఈమె.. కామెడీ షో ద్వారా బాగా ఫేమస్ అయిన అనసూయ దాదాపుగా ఒక్క ఈవెంట్ కు రూ.2 లక్షల వరకు పారితోషకం తీసుకుంటుంది.
రష్మీ గౌతమ్:
జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న మరొక యాంకర్ రష్మీ గౌతమ్. అప్పుడప్పుడు సినిమాలలో నటించినా ఈమె సక్సెస్ కాలేదు . అందుకే యాంకర్ గానే మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎపిసోడ్ రూ.1.70 వేల వరకు పారితోషకం తీసుకుంటుంది.
రవి:
ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించుకున్న మరో మేల్ యాంకర్ రవి.. పటాస్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న రవి ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కు లక్ష రూపాయల వరకు పారితోషకం తీసుకుంటున్నారు.