చలికాలంలో ఎక్కువ తిని లావు పెరుగుతున్నారా? ఐతే ఈ ఆహారాలు మీ కోసమే.

-

సాధారణంగా చలికాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు తక్కువ తాగడం కూడా దీనికి కారణం అయ్యుండవచ్చు. ఐతే చలికాలంలో ఆకలి కారణంగా ఎక్కువ తింటుంటారు. దానివల్ల బరువు పెరిగిపోతుంటారు. మళ్ళీ ఆ బరువు తగ్గడానికి వ్యాయామాలు, తక్కువ తినడాలు చేస్తుంటారు. ఐతే చలికాలంలో ఏ ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

గుడ్లు

గుడ్లలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. పొద్దున్నపూట బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా గుడ్లని తినడం వల్ల తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే బరువు పెరిగే అవకాశం కూడా ఉండదు.

పాలకూర

పాలకూరలో ఉండే పోషకాలు శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అంతే కాదు తొందరగా ఆకలి కలిగించకుండా ఉంటుంది.

బీట్ రూట్

దుంపలైన బీట్ రూట్, స్వీట్ పొటాటో మొదలగు వాటి వల్ల కొవ్వు పెరగకుండా ఉంటుంది. వారంలో ఒక మూడు సార్లైనా ఈ ఆహార పదార్థాలని తీసుకోవడం మంచిది.

ఓట్స్

బరువు తగ్గడానికి ఏదైనా చిట్కా చెప్పండని ఎవరినైనా అడిగితే, వారిచ్చే సలహాల్లో ఓట్స్ తినాలని ఖచ్చితంగా ఉంటుంది. ఓట్స్ లో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అరగడానికి చాలా సమయం పడుతుంది. అందువల్ల తొందరగా ఆకలి వేయదు.

క్వినోవా

ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు కలిగిన క్వినోవాని ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చలికాలంలో తక్కువ కేలరీలు కలిగిన అధిక క్వినోవా బరువు పెరగకుండా సాయపడుతుంది.

అవిసె గింజలు

అవిసె గింజలు ఆకలిని అణచివేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. రోజుకి ఒక అరకప్పు అవిసె గింజలు తింటే చాలు కొవ్వు పెరగకుండా శరీర బరువు కంట్రోల్ లో ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news