నందమూరి తారకరత్న దశదినకర్మ నిన్న ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది ..ఈ కార్యక్రమానికి నందమూరి , నారా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరై తారకరత్న చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. లేకపోతే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు తారకరత్న కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థంగా వంట పాత్రలను బహుమతిగా అందించారు. ప్రెస్టేజ్ కంపెనీకి చెందిన 4.6 లీటర్ల కాసరోల్ ఒక్కొక్కరికి బహుమతులుగా ఇవ్వడం జరిగింది.
దీని విలువ సుమారుగా రూ.1400.. దీనితోపాటు ఈ కాసరోల్ లోపల రెండు, మూడు రకాల స్వీట్ల ప్యాకెట్లు కూడా ఉంచారు. అలాగే “మన హృదయాలలో చిరకాలం నిలిచిపోయే మనకెంతో ఇష్టమైన నందమూరి తారకరత్న జ్ఞాపకార్థం” అని నందమూరి ఫ్యామిలీ తెలియజేస్తున్నట్టుగా అందులో ఒక కార్డును కూడా ఉంచారు. మొత్తం మీద ఈ బహుమతులు అతిధులను చాలా చక్కగా ఆకర్షించాయి. ఇకపోతే నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న శివరాత్రి రోజు కన్ను మూసిన విషయం తెలిసిందే.
దాదాపు 23 రోజులపాటు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో మృత్యుతో పోరాడి చివరకు ఆయన శివైక్యం చెందారు. ఆయన మరణంతో వారి కుటుంబ సభ్యులే కాదు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు కూడా మర్చిపోలేకపోతున్నారు. అలేఖ్య రెడ్డిని ఓదార్చడం ఇప్పటికీ ఎవరి తరం కావడం లేదు. కనీసం ఇప్పటికైనా తారకరత్న తల్లిదండ్రులు మోహనకృష్ణ , శాంతి మోహన్ అలేఖ్య రెడ్డిని చేరదీస్తారా లేదా అన్నది కూడా సందేహంగా మారింది. ఇకపోతే నిన్న జరిగిన పెద్దకర్మ కార్యక్రమంలో తారకరత్న మృతితో నందమూరి ఫ్యామిలీతో పాటు టిడిపి శ్రేణులను కూడా పెద్ద విషాదం నెలకొంది ..ఇక ఆయన కుటుంబ సభ్యులు ఈ బాధాకరమైన విషయం నుంచి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం..