మనల్ని ఆనందంగా ఉంచే.. హార్మోన్స్ ఇవే..!

-

మనం హ్యాపీగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ ఇబ్బంది లేకుండా మంచి ఫీల్ కలిగి ఉంటాము. అయితే మనం హ్యాపీగా ఉండేందుకు కొన్ని హార్మోన్లు బాగా ఉపయోగపడతాయి. హార్మోన్లు బట్టి మన యొక్క ఆనందం ఉంటుంది ఎప్పుడు సరదాగా ఆనందంగా ఉంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాము. మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. నిత్యం ఉత్సాహంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హార్మోన్లు గురించి తెలుసుకోవాలి.

సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ మానసిక స్థితి, నిద్ర, సంతోషం వంటి జీవక్రియలని రెగ్యులేట్ చేస్తుంది. ఈ హార్మోన్ సరైన మోతాదులో రిలీజ్ అవ్వకపోతే ఆనందంగా ఉండలేరు. ఈ హార్మోన్ లెవెల్స్ ని పెంచుకోవడానికి గుడ్లు, చేపలు వంటికి తీసుకోవాలి. వ్యాయామం యోగ చేయాలి అలానే డోపమైన్ అనేది కూడా హ్యాపీ హార్మోన్ ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే ఆనందంగా ఉండొచ్చు. ఈ హార్మోన్ ఉత్పత్తిని పెంచుకోవడానికి 11 నిమిషాల పాటు చల్లని నీళ్లతో స్నానం చేస్తే ఈ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి.

ఎండోర్ఫీన్ అనేది పెయిన్ కిల్లర్ హార్మోన్. నొప్పి నుండి ఉపశమనాన్ని అందించేందుకు ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. మూడ్ స్వింగ్స్ డిప్రెషన్ వంటివి ఉండవు. ఈ హార్మోన్ బాగుంటే బాధ వంటివి ఉండవు. డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది వ్యాయామం కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆక్సిటోసిన్ హార్మోన్ కూడా మన ఆనందం కోసం ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news