మీరు ప్యూరిఫైయర్స్ ని వాడుతున్నారా..? అయితే తప్పక ఇలా చెయ్యండి..!

-

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ని పెడుతున్నారు వాటర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండడం వలన సులభంగా మనకి మంచి వాటర్ దొరుకుతుంది. ఒక్కసారి ప్యూరిఫైయర్ని ఇంట్లో పెట్టుకుంటే చాలు మంచి ఫిల్టర్ వాటర్ మనకి లభిస్తుంది. మీ ఇంట్లో కూడా వాటర్ ప్యూరిఫైయర్ ఉందా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలను తెలుసుకోవాలి హోమ్ ఆర్వో మిషన్ కోసం సెకండరీ ఫిల్టర్ ని ప్రతి మూడు నెలలకి ఒకసారి మార్చుకోవాలి.

ప్రైమరీ ఫిల్టర్ ని ఏడాదికి ఒకసారి మార్చుకోవాలి. అదే విధంగా మిషన్లో ఒక లేయర్ అనేది ఉంటుంది దానిని కనీసం సంవత్సరానికి ఒకసారి మార్చుకోవాలి. మోటర్ వేసినప్పుడు ఆర్వో వాటర్ ఫిల్టర్ ని ఆన్ చేయకూడదు. వాటర్ నింపిన తర్వాత మాత్రమే ఆన్ చేసుకోండి. మీ ఆర్ వో ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యం.

అలానే ట్యాంక్ ని కూడా రెగ్యులర్ గా క్లీన్ చేస్తూ ఉండాలి. ఆర్వో ఉన్న నీటి కనెక్షన్ సరిగ్గా చూడాలి ఒక్కొక్కసారి వాటర్ లీక్ అవుతూ ఉంటుంది అలాంటివి సరిగ్గా గమనించుకోవాలి. నీటిలో ఉప్పు శాతాన్ని బట్టి ఆర్వో మిషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి నీటిలోని ఉప్పు శాతాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మీ ఆరో ట్యాంక్ ని క్లీన్ చేసిన తర్వాత నిమ్మ తొక్క తో బాగా రుద్దితే సూక్ష్మ క్రిములు తగ్గుతాయి నీటి రుచి కూడా బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news